Friday, 25 April 2014

BOOK NO-14 --సువార్త విషిష్టత వాక్యముయొక్క విషిష్టత




సువార్త విషిష్టత వాక్యముయొక్క విషిష్టత



నేటి క్రైస్తవులు కలిగియున్న సువార్తయొక్క  విషిష్టతను పశీరిలిద్ధాము:--

1. రోమీయులకు 1: 16 – (సువార్త రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియై యున్నది)

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 

2. 1 కొరింథీయులకు 15: 1- 4 -- సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు

1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
2.  మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
4.  లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.

3.  1 కొరింథీయులకు 1: 18 -- సిలువనుగూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి

సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

4. 1 పేతురు 1: 21 -- శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజము

మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,

5. రోమీయులకు 8: 1-2 -- జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము

1.  కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి శిక్షావిధియు లేదు.
2.  క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. 

6.  యాకోబు 1: 18 – (సత్యవాక్యము)

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. 

7.  2 తిమోతికి 1: 10 – (జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను)

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.
8. 1 థెస్సలొనీ 2: 13( వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది)
హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

9.  హెబ్రీయులకు 4: 12 – (దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి)

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.


10. మత్తయి సువార్త 4: 4 – (మనుష్యుడు దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును)

అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. 

11.   1 పేతురు 2: 3 – (నిర్మలమైన వాక్యమను పాలు)
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, పాలను అపేక్షించుడి. 

12.  కొలస్సయులకు 1: 25 – (దేవుని వాక్యమును, యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మము)

25. దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు,

13.  2 కొరింథీయులకు 4: 4 – (సువార్త ప్రకాశము దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచును)

4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.

 

 

 Dr. N. Ranga Rao. M Th,PhD.,

Director: united Bible Academy

 rangaraouba@gmail.com





No comments:

Post a Comment